|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:07 PM
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను రాజకీయ కోణంలో చూడటం అతిపెద్ద తప్పని సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. భాజపాతో ఆర్‌ఎస్‌ఎస్‌ను పోల్చడం వల్ల ప్రజల్లో అపార్థాలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కోల్‌కతాలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ధి ఉత్సవాల్లో మాట్లాడుతూ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత కలిగిన సంఘ్‌సేవకులను సృష్టించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని, బలమైన దేశాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సంఘ్‌కు రాజకీయ అజెండా లేదని, దేశమే తొలి ప్రాధాన్యమన్నారు.
Latest News