|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:15 PM
కర్నూలు జిల్లాలో 0-5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలు నగరంలోని ఏ క్యాంప్ పాఠశాలలో పల్స్ పోలియో కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. జిల్లాలో 3.52 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 1630 బూత్‌లు ఏర్పాటు చేశారు. మిగిలిన పిల్లలకు 22, 23 తేదీల్లో డోర్ టు డోర్ చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. భాస్కర్‌రాజు పాల్గొన్నారు.
Latest News