మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
 

by Suryaa Desk | Sun, Dec 21, 2025, 10:56 PM

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో లివర్‌ ఒకటి. లివర్‌ మన శరీరంలో 500 పైగా పనులు నిర్వహిస్తుంది. మన శరీరంలోని జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లివర్‌ ఫిల్టర్‌ చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేయడానికి కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి సాయం చేస్తుంది. పోషకాలను నిల్వ చేయడానికి సహాయపడుతుంది. శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడానికి తోడ్పడుతుంది. ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను లివర్ తయారు చేస్తుంది. మన శరీరంలో కీలక అవయవమైన లివర్‌ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. మన లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మూడింటి నుంచి దూరంగా ఉండాలని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్‌ జిఐ జో సూచించారు. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం.


మందు రోజూ తాగుతున్నారా?


​ఆల్కహాల్‌ రోజూ తాగేవారికి లివర్‌ సమస్యల ముప్పు పెరుగుతుందని డాక్టర్‌ జిఐ జో అన్నారు. మద్యం, లివర్‌ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. లివర్‌ మొండి అవయవం అని చెప్పొచ్చు. దెబ్బతింటే తనకు తానే రిపేర్‌ చేసేసుకుంటుంది. అయితే, మరీ అతిగా, ఎక్కువకాలం మద్యం తాగితే మాత్రం తిరిగి కోలుకునే శక్తిని కోల్పోతుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న లివర్‌ కణాలు పరిపక్వ, పిండ దశల్లోకి మారుతుంటాయి. పరిపక్వ దశలో పోషకాలను గ్రహిస్తుంది, శరీరాన్ని డిటాక్స్‌ చేస్తుంది. పిండ దశలో కొత్త కణాలు ఏర్పడి, దెబ్బతిన్న కణాలు భర్తీ అవుతాయి.


అయితే అతిగా ఆల్కహాల్‌ తీసుకునే వారిలో కణాల దశలు మార్పును నిర్దేశించే ప్రక్రియ (ఆర్‌ఎన్‌ఏ స్ప్లయిసింగ్‌) ప్రాసెస్ చెడిపోతుందని పరిశోధలో గుర్తించారు. దీంతో కాలేయ కణాలు పరిపక్వ దశ నుంచి పిండ దశలోకి మారటానికి బదులు మధ్యస్థ దశలో చిక్కుకుపోతున్నాయి. దీంతో లివర్‌ సిర్రోసిస్‌ వచ్చే ముప్పు కూడా ఉంది. ఆల్కహాల్‌ ఎక్కువగా సేవిస్తే ఫ్యాటీ లివర్‌ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. మీ లివర్‌ను ఆరోగ్యాంగా ఉంచుకోవడానికి ఆల్కహాల్‌ను దూరంగా పెట్టండి. మీరు మొదట చేయాల్సిన పని ఇదే.


క్యాలరీ రిచ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తింటున్నారా?


క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం, ప్రాసెస్డ్‌, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహారం అతిగా తీసుకుంటే లివర్‌ ఆరోగ్యం నాశనం అవుతుందని డాక్టర్‌ జిఐ జో అంటున్నారు. క్యాలరీలు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే డీప్-ఫ్రైడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది.


ఇది NAFLD (నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్) కి ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రాసెస్ చేసిన ఆహారాలలో కనిపించే ట్రాన్స్ ఫ్యాట్స్ వాపు, కాలేయ కణాల నష్టానికి దోహదం చేస్తాయి. చక్కెర అధికంగా ఉండే ఆహారాలు డ్రింక్స్‌ NAFLD ముప్పును పెంచుతాయి. అందుకే వీటిని మానేయాలని డాక్టర్ సూచిస్తున్నారు. మీరు చేయాల్సిన రెండో పని ఇదే.


మీరు చేయాల్సిన మూడో పనేంటో తెలుసా?


ఏడాదికి కనీసం ఒకటి, రెండు సార్లు లివర్‌ టెస్టులు చేయించుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల మొదటి దశలోనే లివర్‌ సమస్యలను గుర్తించి వాటిని తగ్గించుకోవచ్చని డాక్టర్‌ జిఐ జో అంటున్నారు. లివర్‌ టెస్ట్‌లు (LFTలు) బ్లడ్‌ శ్యాంపిల్స్‌తో పాటు మీ కాలేయ స్థితిని గుర్తిస్తాయి.


ఇందులో ALT, AST, ALP వంటి ఎంజైమ్‌లు, ప్రోటీన్‌లు (అల్బుమిన్, టోటల్ ప్రోటీన్), బిలిరుబిన్ వంటి వాటి స్థాయిల్ని కొలుస్తారు. ఈ టెస్టుల ద్వారా లివర్‌ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, లేదా కాలేయానికి జరిగిన నష్టాన్ని గుర్తించి, వాటి తీవ్రతను పర్యవేక్షించడానికి సాయపడతాయి. ముఖ్యంగా హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వాటిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.

Latest News
BJP emerges 'Big Brother' in Maha civic polls, but MahaYuti unity key for future success Mon, Dec 22, 2025, 01:15 PM
SC stays conviction of ex-NCP minister Manikrao Kokate in Nashik housing fraud Mon, Dec 22, 2025, 01:13 PM
Gold rises to record high over strong safe haven demand Mon, Dec 22, 2025, 01:13 PM
North Korea-backed hackers launch cyber attack using computer files Mon, Dec 22, 2025, 12:51 PM
Bangladesh Students' League urges neutral administration for inclusive 2026 elections Mon, Dec 22, 2025, 12:45 PM