స్టార్ట్-అప్ వీసా ఆపేసిన కెనడా
 

by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:44 PM

కెనడా తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తన స్టార్ట్-అప్ వీసా (SUV) కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఆ స్థానంలో తమ దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు 2026లో పైలట్ ప్రాజెక్టు ద్వారా శాశ్వత నివాసానికి కొత్త ప‌థ‌కాన్ని ప్రవేశపెడుతుందని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) తెలిపింది.స్టార్ట్-అప్ వీసా దరఖాస్తుదారులకు అందుబాటులో ఉన్న ఐచ్ఛిక వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తులను ఇకపై అంగీకరించబోమని ఐఆర్‌సీసీ ఇప్ప‌టికే ప్రకటించింది. ఇప్పటికే కెనడాలో ఉన్న తమ ప్రస్తుత ఎస్‌యూవీ వర్క్ పర్మిట్‌ను పొడిగించాలని కోరుకునే దరఖాస్తుదారులకు మాత్రమే మినహాయింపు ఉంటుంద‌ని వెల్ల‌డించింది. ఈ నెల 31 రాత్రి 11.59 గంటలకు కొత్త స్టార్ట్-అప్ వీసా దరఖాస్తులను అంగీకరించడం నిలిపివేస్తామని కూడా డిపార్ట్‌మెంట్ స్ప‌ష్టం చేసింది.

Latest News
Maha Cabinet clears Karmayogi 2.0 and Sarpanch Samvad Wed, Dec 24, 2025, 04:33 PM
New monoclonal antibody safe and effective for rare liver disease Wed, Dec 24, 2025, 04:22 PM
Russia: Two police personnel killed in Moscow explosion Wed, Dec 24, 2025, 04:21 PM
BMC polls: Thackeray cousins' emotional appeal set to clash with BJP's organisational might Wed, Dec 24, 2025, 04:19 PM
Sensex, Nifty end lower ahead of Christmas Wed, Dec 24, 2025, 04:15 PM