|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:48 PM
అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీలేరు నదిలో చేపల వేటకు వెళ్లిన గిరిజనులకు అరుదైన చేప చిక్కింది. బలిమెల వద్ద వలలో పడిన ఈ భారీ చేపను గిరిజనులు సీలేరు సంతకు తీసుకువచ్చారు. పెద్ద తల ఉండే ఇలాంటి వాటిని స్థానికంగా దోబీ రకం చేపలు అని అంటారని గిరిజనులు తెలిపారు. 55 కిలోల బరువున్న ఈ చేపను ఇద్దరు గిరిజనులు కర్రకు కట్టుకొని మోసుకొచ్చారు. ఈ భారీ చేపకు 15 వేల రూపాయల ధర పలికింది.
Latest News