|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:01 PM
చీరాలలోని శంకరయ్య మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల, దేవాంగపురిలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవం సందర్భంగా, ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రధానోపాధ్యాయురాలు బి. సుభాషిణి విద్యార్థులను తమకు ఇష్టమైన రంగాలలో ఏకాగ్రతతో కృషి చేసి, జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరారు. గణిత ఉపాధ్యాయురాలు వి. నీలిమ రామానుజన్ జీవితంలోని ముఖ్య సంఘటనలను, గణితంలో ఆయన ఆవిష్కరణల ద్వారా భారతీయ కీర్తిని పెంచిన తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆర్యభట్టు, బ్రహ్మగుప్త, శకుంతలాదేవి వంటి గణిత మేధావులను విద్యార్థులకు గుర్తుచేశారు. గణితాంశాలపై పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. 5వ తరగతి విద్యార్థులు రామానుజన్ గురించి తెలుగు, ఆంగ్లంలో మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Latest News