|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:00 PM
AP: పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. అన్నదమ్ములను దుండగులు నరికి చంపారు. మృతులు శ్రీరాంమూర్తి, హనుమంతులుగా గుర్తించారు. ఇద్దరు అన్నదమ్ములు టీడీపీలో క్రీయాశీలకంగా ఉన్నారు. జంట హత్యలతో పల్నాడు జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. కుటుంబ కలహాలతోనే హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు జరుగుతోంది.
Latest News