|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:07 PM
రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. ఈరోజు (సోమవారం) చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 78వ జాతీయ అంతర్ రాష్ట్ర, 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. నేటి నుంచి ఈనెల 28 వరకు యోనెక్స్ సన్రైజ్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్‌లు నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్‌లు జరగడం గర్వకారణమన్నారు.క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం జాతీయ–అంతర్జాతీయ పోటీలకు అనుకూలంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ఆధునీకరణ చేశామన్నారు. యోనెక్స్ సన్రైజ్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్‌లు యువ క్రీడాకారులకు మంచి వేదిక అని చెప్పుకొచ్చారు. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ వంటి స్టార్ షట్లర్ల పాల్గొనడం యువతకు ప్రేరణ అని తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ పోటీలను విజయవాడకు తీసుకురావడానికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
Latest News