|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:08 PM
కాకినాడ జిల్లా, ఉప్పాడ ప్రాంతంలో విషతుల్య ఆహారం కలకలం రేపింది. తీర ప్రాంతానికి చెందిన కొందరు మ్యత్సకారులు అస్వస్థతకు గురవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. వివరాల్లోకెళితే...ఉప్పాడ తీర ప్రాంతానికి చెందిన 8 మంది మత్స్యకారుల సమూహం ఇటీవల చేపల లోడింగ్ కోసం బైరవపాలెం వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఆకలేసి తాళ్లరేవు సమీపంలో గల ఓ హోటల్లో బిర్యానీ ఆరగించారు. ఫుడ్ పాయిజన్ కావడంతో.. అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని యు.కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే.. అక్కడి వైద్యులు వీరిని పరీక్షించిన తర్వాత ప్రమాదమేమీ లేదని నిర్ధారించారు. దీంతో బాధితులు సహా వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం.. వారు పిఠాపురంలో చికిత్స పొందుతున్నారు.
Latest News