|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:10 PM
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ డా. వి. నారాయణన్ ఇవాళ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మేజర్ మిషన్లకు ముందు ఇస్రో అధికారులు తిరుమల దర్శనం చేసుకోవడం సంప్రదాయం. ఈసారి డిసెంబర్ 24న జరగబోయే ముఖ్యమైన లాంచ్‌కు శ్రీవారి ఆశీస్సులు కోరుకున్నట్టు తెలుస్తోంది.ఈ నెల 24వ తేదీ ఉదయం 8:54 గంటలకు శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం-3 ఎం6 ద్వారా అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ కంపెనీకి చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత్ నుంచి ఇప్పటివరకు లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లోకి పంపిన అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం.
Latest News