|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:15 PM
ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఈ విషయాన్ని తమన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. లోకేశ్‌తో భేటీ ఎంతో అద్భుతంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.తన పోస్టులో లోకేశ్‌ను 'అన్న' అని ఆప్యాయంగా సంబోధిస్తూ, ఆయనతో జరిపిన సంభాషణ ఎంతో సంతోషాన్నిచ్చిందని తమన్ తెలిపారు. త్వరలో జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)తో పాటు, సంగీతం, కళలకు సంబంధించిన పలు కొత్త ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోను కూడా తమన్ పంచుకున్నారు.ప్రస్తుతం తమన్ పంచుకున్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వంతో కలిసి తమన్ ఏమైనా కార్యక్రమాలు లేదా ప్రాజెక్టులు చేపట్టనున్నారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
Latest News