|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 04:45 PM
యాషెస్ సిరీస్ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. అడిలైడ్ టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా లియోన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు క్రచెస్ సహాయంతో నడుస్తూ కనిపించాడు. ఈ గాయం తీవ్రమైనదిగా భావిస్తున్నారు. ఇప్పటికే జోష్ హాజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లు గాయపడ్డారు. కాగా మూడో టెస్టులో లియోన్ 5 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Latest News