|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:22 PM
రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. దేశం ఆకలి తీర్చేందుకు తమ జీవితాలను అంకితం చేసిన అన్నదాతలందరికీ ఆయన జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.... దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 23 ను జాతీయ రైతుల దినోత్సవం (కిసాన్ దివస్) గా జరుపుకుంటారు. ఈ రోజు, రైతుల సంక్షేమానికి అంకితభావంతో కృషి చేసిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా నిర్వహించబడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు వెన్నెముకలాంటివారు. ఆహార భద్రతను కాపాడడంలో, గ్రామీణ అభివృద్ధిలో రైతుల పాత్ర అమూల్యమైనది. వర్షాలు, ప్రకృతి విపత్తులు వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రైతులు దేశానికి ఆహారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం లోని, దేశంలోని రైతులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని తెలిపారు.
Latest News