|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:23 PM
ఏపీని ‘అత్యాచార ఆంధ్రప్రదేశ్’గా మార్చారని వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మండిపడ్డారు. 18 నెలల కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఈ ప్రభుత్వం పోలీసులు ప్రజల రక్షణకు కాకుండా ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు ఉపయోగించుకుంటుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చెప్పడానికి ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాసిన లేఖే నిదర్శనమన్నారు. నెల్లూరులోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
Latest News