|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:24 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి వైయస్‌ఆర్ జిల్లా పులివెందులలో మూడు రోజుల పర్యటనకు రానున్నారు. డిసెంబర్ 23 నుంచి 25, 2025 వరకు ఆయన పులివెందులలో ఉండనున్నారు.పర్యటనలో భాగంగా డిసెంబర్ 23న మధ్యాహ్నం బెంగళూరు నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా పులివెందుల సమీపంలోని భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి క్యాంప్ కార్యాలయానికి చేరుకొని సాయంత్రం వరకు పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. డిసెంబర్ 24న ఉదయం పులివెందుల నివాసం నుంచి ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్‌లో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో స్థానిక నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతారు.డిసెంబర్ 25న ఉదయం పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో వైయస్ జగన్ పాల్గొంటారు. అనంతరం భాకరాపురం హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా బెంగళూరుకు తిరుగు ప్రయాణం అవుతారు.
Latest News