|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:25 PM
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలంలోని పోతవరప్పాడు శివారులో ఉన్న మ్యాంగో రిక్రియేషన్ క్లబ్ లో పేకాట ఆడిస్తున్న మంత్రి ఎవరు? ఏడాదిన్నరగా యథేచ్ఛగా పేకాట శిబిరం నడుస్తుందని స్థానికులు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసుల దాడుల్లో కోట్ల కొద్దీ నగదు దొరకడంతోపాటు 120 కి పైగా కార్లు, 50 కి పైగా బైకులను పోలీసులను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తున్నా ఎల్లో మీడియాలో దీనికి సంబంధించి ఒక్క వార్త కూడా రాకపోవడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. దీనిపై ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల అండదండలతోనే పేకాట శిబిరం నడుస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పారు. గోవా తరహాలో టోకెన్ సిస్టం పెట్టి క్లబ్బును రూ. 10 వేలు, రూ. 50 వేలు, రూ. లక్ష, రూ.5 లక్షల జోన్లుగా విభిజించి పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి జూదగాళ్లను పిలిపించి మరీ పేకాట ఆడిస్తున్నారని, జూదగాళ్లను ఆకర్షించడానికి అధిక మొత్తంలో అప్పులు కూడా ఇస్తున్నారని శివశంకర్ వివరించారు. క్లబ్బుపై దాడులు చేయడానికి వచ్చిన పోలీసులను క్లబ్బు నిర్వాహకులు బెదిరించారని, హైకోర్టు అనుమతులతోనే ఈ జూదశాలను నిర్వహిస్తున్నట్టు చెప్పుకోవడంతో పాటు పబ్లిక్‌గా బోర్డు కూడా ఏర్పాటు చేయడం అంటే న్యాయస్థానాలను కూడా వాడుకోవడం కాదా అని ప్రశ్నించారు.
Latest News