|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:26 PM
చంద్రబాబు నేతత్వంలోని కూటమి పాలనలో రాష్ట్రం డ్రగ్స్ డెన్‌గా మారిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిలిచ్చిందని, టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్, గంజాయి దందా యధేచ్చగా సాగుతోందని ఆయన ఆక్షేపించారు. పోలీసులకు శాంతిభద్రతలు, ప్రజారక్షణ పట్టడం లేదని, వారు కేవలం వైయస్ఆర్‌సీపీనాయకుల అక్రమ అరెస్టులకే పని చేస్తున్నారని దుయ్యబట్టారు. నేరుగా ఢిల్లీ నుంచి ఏపీకి డ్రగ్స్ సరఫరా అవుతున్నా, సీఎం చంద్రబాబులో కనీస స్పందన లేదని అన్నారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్), గంజాయి సాగును సమర్థంగా నివారిస్తే.. కూటమి ప్రభుత్వం రాగానే దురుద్దేశంతో దాన్ని రద్దు చేసిందని ప్రస్తావించారు. సెబ్ స్థానంలో ఏర్పాటు చేసిన ‘ఈగల్’ విభాగం డ్రగ్స్, గంజాయి నియంత్రణలో పూర్తిగా విఫలమైందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా డ్రగ్స్, గంజాయి నియంత్రణకు కృషి చేయకపోతే, న్యాయపోరాటం చేస్తామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంగవీటి నరేంద్ర హెచ్చరించారు.
Latest News