|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:33 PM
రాష్ట్రంలో యూరియా సరఫరాకు సంబంధించి ప్రభుత్వ అంచనాలకు, వాస్తవాలకు ఎక్కడా పొంతన ఉండటం లేదని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ (వ్యవసాయం మరియు రైతు సంక్షేమం) ఎంవీయస్ నాగిరెడ్డి వెల్లడించారు. రబీ సాగు పూర్తిగా మొదలవ్వక ముందే యూరియా కొరత ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. నానో యూరియా కొనాలని ఒత్తిడి చేసే డీలర్లపై చర్యలు తీసుకోవాలన్న నాగిరెడ్డి, రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రబీ సీజన్ సాగు పూర్తిస్థాయిలో జరగక ముందే క్షేత్రస్థాయిలో యూరియా కొరత తలెత్తడం చూస్తుంటే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ అంచనాలకు, వాస్తవాలకు ఎక్కడా పొంతన లేదు. డిసెంబరు చివరి నాటికి 3.93 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేస్తే, ఇప్పటికే 3.23 లక్షల టన్నులు అమ్మినట్లు రికార్డుల్లో చూపడం ఆశ్చర్యకరం. రాష్ట్రంలో యూరియా వాడకం, నిల్వలపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలి అని డిమాండ్ చేసారు.
Latest News