|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:33 PM
అనంతపురం నగరంలో జేఎన్టీయూ వద్ద ఉన్న కె ఎస్ ఎన్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో బాధ్యత మరిచిన క్రీడా గురువు మహిళా విద్యార్థినిలని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి గురించి జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ గారిని వైయస్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్ధి విభాగం నాయకులు కలిశారు వారు మాట్లాడుతూ గతంలో క్రీడా మైదానంలో విద్యార్థినులపై అసభ్యకర పదజాలంతో దూషిస్తూ తన కాళ్లకున్న బూట్ల లేసులను మహిళా విద్యార్థినులతో కట్టించుకోవడం, శ్రీకృష్ణదేవరాయ అంతర్ కళాశాలల మహిళా పోటీల్లో క్రీడలు ఆడని వారిని జట్టుకు ఎంపిక చేసి ఆడిన వారిని ఎంపిక చేయకపోవడం, విద్యార్థినిలను అసభ్య పదజాలంతో మాట్లాడి,పిడి చెప్పినట్లు వినలేని వారిని ఆటకు దూరం చేశారని కొందరిని నిరంతరం వేధింపులే లక్ష్యంగా కళాశాలలో పనిచేస్తున్నారని ఇలాంటి వెకిలి చేష్టలు భరించలేక విద్యార్థినిలు క్రీడలకు,చదువుకు దూరం అవుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొనిందని అతని మీద చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ జాయింట్ కలెక్టర్ గారిని కోరారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రతి పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థులు కార్మికులగా మారిపోతున్నారని విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే పిల్లలను పనుల్లో నిమగ్నం చేయడం ఏ పాటిదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం పైన నమ్మకంతోనే పిల్లలను తల్లిదండ్రులు కళాశాలలకు పంపుతున్నారని వారితో మీరు పనులు చేయిస్తుంటే కూటమి ప్రజా ప్రతినిధులు కళ్ళకి గంతలు కట్టుకోవడం ఎంత మాత్రం సమంజసం అని పేర్కొన్నారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని విద్యావ్యవస్థలో ఇంత జరుగుతున్న కూడా మంత్రి నారా లోకేష్ గారు ఎందుకు వారికి మద్దతుగా నిలుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు విద్య మీద ప్రేమ ప్రభుత్వ విద్య మీద ద్వేషాన్ని ప్రతి సందర్భంలోనూ మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళ బుచ్చుతున్నారని ప్రభుత్వ విద్యార్థుల మీద తమ వైఖరి విధానాన్ని మార్చుకోవాలని లేనిచో ఉద్యమాలు ఉదృతం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కార్యక్రమంలో వైయస్ఆర్ విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు కైలాష్ నగర కార్యదర్శులు పులికార్తికేయ, సాయి యాదవ్, జగన్, కార్తీక్, చలపతి, మనోజ్ కుమార్, చరణ్, రఫీ, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
Latest News