|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:32 PM
ఉత్తరాదిన దట్టమైన పొగమంచు కారణంగా మంగళవారం తెల్లవారుజామున ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ జిల్లాలో లఖ్‌నవూ-వారణాసి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రక్కు రెయిలింగ్‌ను ఢీకొన్న తర్వాత.. వెనుక నుంచి వచ్చిన మూడు ట్రక్కులు, ఒక కారు, బస్సు దానిని ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Latest News