|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 02:44 PM
బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ అతివాదుల చేతిలో దారుణ హత్యకు గురైన హిందూ యువకుడు దీపు చంద్రదాస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తోటి ఉద్యోగులే అతడిని ఉన్మాద మూకకు అప్పగించడంతో పాటు వారితో కలిసి అతడిపై దాడిచేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.మైమన్ సింగ్ జిల్లా భలుకాలోని 'పయనీర్ నిట్‌వేర్స్' గార్మెంట్ ఫ్యాక్టరీలో దీపు చంద్ర దాస్ (27) పనిచేసేవాడు. మతపరమైన వ్యాఖ్యలు చేశాడన్న అస్పష్టమైన ఆరోపణలతో గురువారం సాయంత్రం ఫ్యాక్టరీలో ఉద్రిక్తత మొదలైంది. అయితే, అతడిని కాపాడాల్సిన ఫ్యాక్టరీ యాజమాన్యం, తోటి ఉద్యోగులు నమ్మకద్రోహానికి పాల్పడ్డారు.పోలీసుల కథనం ప్రకారం.. దీపును కాపాడే అవకాశం ఉన్నప్పటికీ, ఫ్యాక్టరీ సూపర్‌వైజర్లు అతడితో బలవంతంగా రాజీనామా చేయించారు. ఆ తర్వాత రక్షణ కల్పించాల్సింది పోయి, బయట వేచి ఉన్న ఉన్మాద మూకకు అతడిని అప్పగించారు. ఫ్యాక్టరీ రక్షణ కోసం ఒక నిరపరాధిని బలి ఇచ్చారని రాపిడ్ యాక్షన్ బెటాలియన్ పేర్కొంది.
Latest News