|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 02:46 PM
పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్‌లో ప్రముఖ బెంగాలీ గాయని లగ్నజిత చక్రవర్తికి ఊహించని అనుభవం ఎదురైంది. లైవ్ కన్సర్ట్‌లో పాట పాడుతుండగా ఒక వ్యక్తి ఆమెపై దాడికి ప్రయత్నించడమే కాకుండా భక్తి పాటలు ఆపి, సెక్యులర్ (మతాతీత) పాటలు పాడాలంటూ హుకుం జారీ చేశాడు. భగవాన్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం లగ్నజిత మ్యూజికల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. షో మొదలైన 45 నిమిషాల వరకు అంతా సాఫీగానే సాగింది. ఈ క్రమంలో లగ్నజిత త్వరలో విడుదల కానున్న ‘దేవీ చౌధురాని’ సినిమాలోని ‘జాగో మా’ అనే పాట పాడారు.పాట ముగిసిన వెంటనే ఓ వ్యక్తి ఒక్కసారిగా స్టేజ్‌పైకి దూసుకొచ్చాడు. దీంతో అక్కడున్న వారు అడ్డుకున్నారు. ఆ సమయంలో అతడు గట్టిగా అరుస్తూ.. ‘‘నీ 'జాగో మా’ పాటలు ఇక చాలు.. ఏదైనా సెక్యులర్ సాంగ్ పాడు" అని డిమాండ్ చేసినట్టు గాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Latest News