|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 02:48 PM
రాజకీయ సభల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడటం డొనాల్డ్ ట్రంప్‌కు అలవాటే. కానీ, తాజాగా నార్త్ కరోలినాలో జరిగిన ర్యాలీలో ఆయన తన భార్య మెలానియా ట్రంప్ లోదుస్తుల గురించి మాట్లాడి అందరినీ విస్మయానికి గురిచేశారు. రాజకీయ ప్రసంగం మధ్యలో అకస్మాత్తుగా ఈ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.2022 ఆగస్టులో ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం 'మార్-ఎ-లాగో'పై ఎఫ్‌బీఐ జరిపిన సోదాల గురించి ఆయన ఈ సభలో ప్రస్తావించారు. ఆ సమయంలో ఫెడరల్ ఏజెంట్లు తన భార్య మెలానియా క్లోసెట్ (అలమర) మొత్తాన్ని గాలించారని ట్రంప్ ఆరోపించారు. ‘‘ఏజెంట్లు ఆమె సామాన్లన్నీ వెతికారు. అక్కడ ఆమె లోదుస్తులు చాలా పద్ధతిగా, పర్ఫెక్ట్‌గా మడతపెట్టి ఉన్నాయి. బహుశా ఆమె వాటిని ఐరన్ చేస్తారనుకుంటా" అంటూ వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న విచారణలు అన్యాయమని చెప్పే క్రమంలో ట్రంప్ ఈ వింత పోలికలను వాడటం గమనార్హం.
Latest News