|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:10 PM
అమరావతి బ్రాండ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బలంగా నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పర్యాటక శాఖ 'ఆవకాయ' పేరుతో సరికొత్త ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ ఫెస్టివల్‌ను జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.ఈ కార్యక్రమం వివరాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. "తెలుగు నేలపై పుట్టిన కథ, కవిత, సినిమా, సంగీతం, నాటకం వంటి అన్ని కళారూపాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమే 'ఆవకాయ'. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ ఉత్సవం లక్ష్యం" అని ఆయన తెలిపారు. ఏపీ పర్యాటక శాఖ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. సాధారణంగా ఇండోర్ హాళ్లకే పరిమితమయ్యే ఇలాంటి కార్యక్రమాలను తొలిసారిగా బహిరంగ ప్రదేశాల్లో, ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం 'ఆవకాయ' ప్రత్యేకత అని మంత్రి దుర్గేష్ వివరించారు.
Latest News