|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:11 PM
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమిపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. సోమవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో జట్టు ఆటతీరుపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం బోర్డు పెద్దలను కలతకు గురిచేసింది. జనవరిలో అండర్ 19 ప్రపంచకప్ ఉన్నందున, ఆటగాళ్లు తమ లోపాలను సవరించుకోవాలని సూచించారు. మరోవైపు, ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్‌పై దుర్భాషలాడిన ఆయుష్, వైభవ్ లపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై పీసీబీ చీఫ్ నక్వీ ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.
Latest News