|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:15 PM
కొత్త సంవత్సరం 2026 జనవరిలో బ్యాంకులకు 15కు పైగా సెలవులు రానున్నాయని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. జాతీయ సెలవులతో పాటు రాష్ట్ర పండుగలు, వారాంతాలు (ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు) కూడా ఈ సెలవుల్లో ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. సెలవు దినాల్లోనూ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. జనవరి 1న న్యూ ఇయర్ డే, 14న మకర సంక్రాంతి, 26న రిపబ్లిక్ డే వంటి ముఖ్యమైన సెలవులు ఉన్నాయి.
Latest News