కెనడాలో మద్యం వాసనతో పట్టుబడ్డ ఎయిరిండియా పైలట్
 

by Suryaa Desk | Thu, Jan 01, 2026, 08:41 PM

ఎయిరిండియాకు చెందిన ఓ పైలట్ కెనడాలో అధికారులకు పట్టుబడ్డాడు. అతని నుంచి మద్యం వాసన వస్తుండటంతో వాంకోవర్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కారణంగా ఢిల్లీకి బయలుదేరాల్సిన విమానం గంటల తరబడి ఆలస్యమైంది. డిసెంబర్ 23న క్రిస్మస్ సమయంలో ఈ ఘటన జరిగింది. వాంకోవర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన AI186 విమాన పైలట్, విధులకు హాజరయ్యే ముందు అతడి వద్ద మద్యం వాసన వచ్చింది. దీన్ని గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది, వెంటనే కెనడా అధికారులకు సమాచారం అందించారు. వారు సదరు పైలట్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించగా, అందులో అతను విఫలమయ్యాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఈ ఘటనపై ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది.డిసెంబర్ 23న వాంకోవర్-ఢిల్లీ విమానం  ఆలస్యమైంది. విమానం బయలుదేరడానికి ముందు, పైలట్ ఫిట్‌నెస్‌పై కెనడా అధికారులు ఆందోళన వ్యక్తం చేయడంతో అతడిని విమానం నుంచి దించేశాం. భద్రతా నిబంధనల ప్రకారం వెంటనే మరో పైలట్‌ను ఏర్పాటు చేశాం. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం అని తెలిపింది.స్థానిక అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది. విచారణ పూర్తయ్యేంత వరకు సదరు పైలట్‌ను ఫ్లయింగ్ డ్యూటీల నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. నిబంధనల ఉల్లంఘనపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని పాటిస్తామని, విచారణలో దోషిగా తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని సంస్థ పునరుద్ఘాటించింది

Latest News
Sports fraternity 'celebrates the constitution that shapes India' on 77th Republic Day Mon, Jan 26, 2026, 12:59 PM
Republic Day: Indian Army showcases four-legged warriors in a historic first Mon, Jan 26, 2026, 12:56 PM
Breaking protocol, PM Modi walks down Kartavya Path, greets people Mon, Jan 26, 2026, 12:53 PM
EAM Jaishankar, Canada's Anita Anand discuss deepening bilateral ties Mon, Jan 26, 2026, 11:31 AM
Aus Open: Pegula ends Keys' title defence in straight sets Mon, Jan 26, 2026, 11:11 AM