|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 10:34 PM
ఓటీటీలో హారర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. భయభీతితో కూడిన సీన్‌లు చూసి నెటిజన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పటికే వందల సంఖ్యలో హారర్ మూవీస్ వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇతర భాషలలో విడుదలైన హారర్ సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.ఇప్పటివరకు చూసిన హారర్ సినిమాలన్నీ మరిచిపోతే, ఈసారి ఓ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఎవరు చూసినా చర్చ చేస్తూనే ఉంటారు. ఈ సినిమాను చూడటానికి ధైరం తప్పనిసరి. ఒంటరిగా చూస్తే వెన్ను చిందులు పెట్టే స్థాయి.కథ విషయానికి వస్తే, ఆశ (రేవతి) ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. భర్త చనిపోయిన తరువాత తన కొడుకు వినును పెంచుతూ ఉంటుంది. ఆమెతో పాటు తన తల్లి కూడా ఉంది, కానీ అనారోగ్యంతో బాధపడుతోంది. విను ఎంబీబీఎస్ చదవాలని కోరుకుంటున్నా, తల్లి ఆశ బలవంతంగా అతన్ని బీఫార్మసీలో చేర్పిస్తుంది. చదువు పూర్తిచేసిన విను రెండేళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు, కానీ ఒక్క జాబ్ రాదు. దాంతో సొంత ఊరు వదిలి మరొక ప్రదేశంలో ఉద్యోగం చేయాలనుకుంటాడు.కానీ తల్లి ఆశ అంగీకరించదు. ఆతర్వాత ఒకరోజు అతని అమ్మమ్మ చనిపోతుంది. ఆమె మరణం దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. విను, అమ్మమ్మ మరణం తర్వాత, ఇంట్లో వింత శబ్దాలు, విచిత్ర ఆకారాలను చూస్తాడు. కానీ ఎవరు అతన్ని నమ్మరు. కుటుంబంలో చాలామందికి మానసిక సమస్యలు ఉండటంతో, డాక్టర్ కూడా విను కూడా అదే సమస్యతో బాధపడుతున్నాడని అంటాడు.తరువాత, కొన్ని మరిన్ని సంఘటనలలో విను, ఆశ ఇద్దరూ ఇంట్లో ఏదో ఉన్నది అని అర్థం చేసుకుంటారు. కానీ ఆ ఇంట్లో నిజానికి ఏమి జరుగుతుంది? అక్కడ ఉన్నది ఏమిటి? ఇక్కడకు ముందే ఉన్నవారికి ఏమైంది? విను, ఆశ ప్రాణాలతో బయటకు వచ్చారా లేదా? అన్నదే చూడాల్సిన సస్పెన్స్.ఈ సినిమా పేరు భూతకాలం. మలయాళంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో డబ్ చేయబడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
Latest News