|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 10:50 PM
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై అదనపు పన్నులు విధించడానికి నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనలు జీఎస్టీకి అదనంగా అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు హానికరమైన వస్తువులపై ఉన్న పరిహార సెస్ స్థానంలో ఇవి వర్తించనుంది. కేంద్రం బుధవారం ఫిబ్రవరి 1 నుండి ఈ కొత్త పన్ను రేట్లు అమలులోకి రావనున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.నోటిఫికేషన్ ప్రకారం, ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు, ఇతర పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. బీడీలపై 18 శాతం వస్తు సేవల పన్ను అమలులోకి వస్తుంది. అదనంగా పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ విధించబడుతుంది. అలాగే పొగాకు, జర్దా, నిమ్మ పొగాకు, గుట్కా ప్యాకింగ్ యంత్రాల (సామర్థ్య నిర్ధారణ, సుంకం వసూలు) నియమాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2026 వరకు అమలు చేస్తుందని పేర్కొంది.ఇక 'హెల్త్ సెక్యూరిటీ & నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025' పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు – “పాన్ మసాలాపై ఇప్పటికే 40 శాతం జీఎస్టీ ఉంది. దీని పై సెస్ కూడా ఉంటుంది. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుంది. సేకరించిన నిధులు జాతీయ భద్రత మరియు ప్రజారోగ్య పనులకు వినియోగించబడతాయి.”కేంద్రం నోటిఫికేషన్ ప్రభావంతో సిగరెట్ కంపెనీల షేర్లు ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ మార్కెట్లో నష్టాల్లోకి వచ్చాయి. ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరగనుండటంతో అమ్మకాలు తగ్గనున్నాయని అంచనా వేసి స్టాక్‌లు నష్టపోయాయి. బీఎస్‌ఈలో ఐటీసీ షేరు 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది, ఫిలిప్స్ షేరు 10 శాతం కిందకు వచ్చింది.
Latest News