|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 02:55 PM
మద్రాస్‌లోని ఐఐటీ విద్యార్థులతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ శుక్రవారం మాట్లాడారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను 'ఓ చెడ్డ పొరుగు దేశం'గా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని కొనసాగించే దేశం నుంచి ప్రజలను రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని, అవసరమైతే స్వీయరక్షణ కోసం ఏదైనా చేస్తామని ఆయన హెచ్చరించారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఉగ్రవాదం కొనసాగితే పొరుగువారితో మంచి సంబంధాలు ఉండవని, ఇది పొంతన లేని విషయమని స్పష్టం చేశారు.
Latest News