|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:06 PM
నూతన సంవత్సరం సందర్భంగా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫొటోకు సెలబ్రేషన్స్ ఎమోజీని జత చేశాడు. ఎటువంటి క్యాప్షన్ లేకుండా కేవలం సెలబ్రేషన్ ఎమోజీతో ఫోటోను పంచుకున్నాడు. కోహ్లీ ఈ ఫోటొను పంచుకున్న కొన్ని గంటల్లోనే దాదాపు ఆరు లక్షల లైక్స్ వచ్చాయి. కోహ్లీ, అనుష్కల ప్రేమ ఒక వాణిజ్య ప్రకటన సమయంలో మొదలైంది. 2017 డిసెంబరులో వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2021లో వారికి కుమార్తె జన్మించగా, 2024లో కుమారుడు జన్మించాడు.
Latest News