|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:07 PM
ఎయిరిండియాకు చెందిన ఓ పైలట్ కెనడాలో అధికారులకు పట్టుబడ్డాడు. అతని నుంచి మద్యం వాసన వస్తుండటంతో వాంకోవర్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కారణంగా ఢిల్లీకి బయలుదేరాల్సిన విమానం గంటల తరబడి ఆలస్యమైంది.వివరాల్లోకి వెళితే, డిసెంబర్ 23న క్రిస్మస్ సమయంలో ఈ ఘటన జరిగింది. వాంకోవర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన AI186 విమాన పైలట్, విధులకు హాజరయ్యే ముందు అతడి వద్ద మద్యం వాసన వచ్చింది. దీన్ని గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది, వెంటనే కెనడా అధికారులకు సమాచారం అందించారు. వారు సదరు పైలట్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించగా, అందులో అతను విఫలమయ్యాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Latest News