|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:08 PM
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు పరిపూర్ణ ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. తొలి మూడు రోజుల్లో (డిసెంబర్ 30, 31, జనవరి 1) మొత్తం 1,77,337 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. ఈ దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ దర్శనాల్లో, మొదటి మూడు రోజులు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే అనుమతించారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్ ప్రవేశ మార్గాల వద్ద టోకెన్లను స్కాన్ చేసి భక్తులను దర్శన క్యూలైన్లలోకి పంపించారు. గురువారం నాడు సాయంత్రం 5 గంటల సమయానికి 40,008 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Latest News