|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:10 PM
దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాజకీయ పార్టీలతో జరుపుతున్న సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా, గురువారం జనసేన పార్టీ ప్రతినిధుల బృందం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో ఈసీ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనసేన తరఫున పార్టీ ప్రతినిధులు ఇ. ప్రతాప్ కుమార్, ఆర్.ఎం.వి. సుమంత్ హాజరై, ఎన్నికల సంస్కరణలపై తమ పార్టీ తరఫున పలు సూచనలు అందజేశారు. అయితే, ఈసీకి సమర్పించిన ప్రతిపాదనల వివరాలను జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించలేదు.
Latest News