|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:23 PM
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 33 వేల వాహనాలు తిరుమలకు చేరుకోగా, సుమారు 1,77,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదైంది. డిసెంబర్ 30న రూ. 2.25 కోట్లు రాగా, 31న ఏకంగా రూ. 4.79 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తుల దాహార్తిని తీర్చేందుకు టీటీడీ ఓ వినూత్న ఆలోచనను అమలు చేసింది. ఎండలో అలసిపోయే భక్తులకు తక్షణమే నీరు అందించేలా శ్రీవారి సేవకులు వీపుకు వాటర్ క్యాన్లను (Mobile Water Dispensing) తగిలించుకుని గ్లాసులతో నీటిని అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులకు ఈ సేవ ఎంతో ఊరటనిస్తోంది.
Latest News