|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:56 PM
నంద్యాల వైసీపీ నాయకుడు ప్రదీప్ రెడ్డి, సుమారు రెండు వేల మంది అనుచరులతో కలిసి శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి ఎన్ఎండీ ఫరూక్, రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ సమక్షంలో వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. భారీ ర్యాలీతో టిడిపి కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ చేరిక నంద్యాల రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.
Latest News