ఏపీలో ఆ జిల్లావాసులకు.. కీలక రైళ్లకు హాల్ట్‌లు
 

by Suryaa Desk | Fri, Jan 02, 2026, 07:29 PM

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. శ్రీకాకుళం జిల్లా వాసుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. నూతన సంవత్సరం సందర్భంగా రైల్వే శాఖ.. శ్రీకాకుళం జిల్లా వాసులకు శుభవార్త అందించింది. శ్రీకాకుళం జిల్లాలో పలు కీలక రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.


" శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే డిమాండ్‌లకు నేడు అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం, అనుసంధానం, రోజువారీ ప్రయాణ సౌలభ్యానికి ఉపయోగపడేలాగా రైల్వే శాఖ.. జిల్లాలోని కీలక రైల్వే స్టేషన్లలో హాల్ట్‌లు మంజూరు చేసింది." అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.


పూరి – అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఇచ్చాపురం వద్ద హాల్ట్ సౌకర్యం కల్పించారు. అలాగే బెరంపూర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలుకు తిలారు వద్ద, భువనేశ్వర్– న్యూ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ – బారువ వద్ద హాల్ట్ సౌకర్యం ఇచ్చారు. ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.


ప్రజా ప్రయోజనాన్ని ప్రధానమైనదిగా తీసుకుని, ఈ అంశం గురించి తాను ఎంతోకాలంగా నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. తన విజ్ఞప్తికి సానుకూల స్పందన ఇచ్చి సహకరించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన రైలు సౌకర్యాలు, అభివృద్ధి దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగుగా రామ్మోహన్ నాయుడు వర్ణించారు.


మరోవైపు ఏపీలో రైలు సర్వీసులకు సంబంధించి రైల్వే శాఖ ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే విజయవాడ - చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నరసాపురం వరకూ పొడిగించారు. అలాగే కాచిగూడ యశ్వంతపూర్ వందేభారత్ రైలుకు హిందూపురంలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. తాజాగా పలు కీలక రైళ్లకు శ్రీకాకుళం జిల్లాలో స్టాపింగ్ సౌకర్యం కల్పించారు.

Latest News
AIIMS Delhi performed over 1,000 robotic surgeries in last 13 months Tue, Jan 20, 2026, 04:06 PM
Sensex, Nifty end sharply lower amid rising global tensions Tue, Jan 20, 2026, 04:05 PM
Baloch rights body flags extrajudicial killings under guise of encounters by Pak forces Tue, Jan 20, 2026, 04:04 PM
India and BJP will have new direction under Nitin Nabin: Nityanand Rai Tue, Jan 20, 2026, 04:01 PM
Spanish Foreign Minister Jose Manuel Albares to visit India Tue, Jan 20, 2026, 03:00 PM