|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:12 PM
చెన్నైలోని కాసిమేడు బీచ్‌లో అరుదైన, ప్రమాదకరమైన బ్లూ డ్రాగన్ చేపలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వీటిని గ్లాకస్ అట్లాంటికస్ అని కూడా పిలుస్తారు. ఈ చేపల కాటు వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, వికారం, అలెర్జీలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి విషపూరిత జెల్లీ ఫిష్‌లను తిని జీవిస్తాయి. ప్రజలు వీటిని తాకవద్దని, అరుదైన జీవులు కనిపిస్తే అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. గత సంవత్సరం స్పెయిన్‌లో ఇలాంటి సంఘటన జరిగింది.
Latest News