|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:10 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య & ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆదేశాలు, మార్గదర్శకత్వంతో ధర్మవరం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు ప్రైమరీ హెల్త్ సెంటర్ల పరిధిలో పనిచేయుటకు నియమితులైన ఆశా వర్కర్లకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో శుక్రవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు బత్తలపల్లి మండలం మాల్యవంతం, ఓబులాపురం, ధర్మవరం రూరల్ మలినేనిపల్లి, ధర్మవరం టౌన్ నేసే పేట లాంటి పలు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఆశా వర్కర్లుగా ఎంపికైన మహిళలకు ఆయన చేతుల మీదుగా జాయినింగ్ ఆర్డర్ పత్రాలను అందజేశారు.
Latest News