కోహ్లీ, రోహిత్, అశ్విన్‌లకు వీడ్కోలు మ్యాచ్‌లు ఉండాల్సిందన్న ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్
 

by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:36 PM

భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌ల విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సుదీర్ఘకాలం పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు వారి స్థాయికి తగినట్లుగా వీడ్కోలు టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పనేసర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "ఆర్. అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కోసం బీసీసీఐ వీడ్కోలు టెస్ట్ మ్యాచ్‌లను ప్లాన్ చేయాల్సింది. వారు ఆ గౌరవానికి అర్హులు. ఇంగ్లండ్ తమ ఆటగాళ్లు రిటైర్ అవుతున్నప్పుడు వారిని ఘనంగా గౌరవిస్తుంది. ఉదాహరణకు, స్టూవర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్‌లకు గొప్ప వీడ్కోలు లభించింది. కానీ ఈ విషయంలో భారత్ వెనుకబడి ఉంది" అని పనేసర్ స్పష్టం చేశాడు.గత ఏడాది మే నెలలో కోహ్లీ, రోహిత్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, 2024 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.ఆధునిక క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా పేరుగాంచిన కోహ్లీ, 123 టెస్టుల్లో 46.85 సగటుతో 30 సెంచరీలతో 9,230 పరుగులు చేశాడు. మరోవైపు రోహిత్ శర్మ 67 టెస్టుల్లో 12 సెంచరీలతో 4,301 పరుగులు సాధించాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి, అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కెరీర్‌ను ముగించాడు. బ్యాట్‌తోనూ ఆరు సెంచరీలు సాధించడం విశేషం. ఈ ముగ్గురు ఆటగాళ్లకు మరింత గౌరవప్రదమైన వీడ్కోలు లభించి ఉండాల్సిందని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Latest News
Anti-terrorist operation resumes in J&K's Kishtwar Mon, Jan 19, 2026, 11:01 AM
NDRF works tirelessly to protect lives, provide relief: PM Modi Mon, Jan 19, 2026, 10:53 AM
Nitin Nabin to file nomination for BJP National President today Mon, Jan 19, 2026, 10:51 AM
India set to transition to upper middle income country by 2030: SBI Research Mon, Jan 19, 2026, 10:48 AM
Pragmatic India shaping balance: Zakaria Mon, Jan 19, 2026, 10:46 AM