|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 11:19 AM
ప్రకాశం జిల్లా, మార్కాపురం సమీపంలో దోర్నాల-ఆత్మకూరు రహదారిలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడి నందికొట్కూరుకు చెందిన భరత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Latest News