|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 11:32 AM
దేశంలో వైట్ కాలర్ టెర్రరిజం పెరుగుతోందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివిన వారే దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన భూపాల్ నోబుల్స్ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాలెడ్జ్‌తో పాటు నైతిక విలువలు, క్యారెక్టర్‌ను నిర్మించే విద్య అవసరమని నొక్కి చెప్పారు. మతం అనేది దేశం, సమాజానికి నిర్వర్తించాల్సిన విధి గురించి చెప్పేదని, ప్రార్థనా మందిరాలకు వెళ్లడమే మతం కాదని ఆయన అన్నారు.
Latest News