|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 12:12 PM
చోడవరం సహకార షుగర్ ఫ్యాక్టరీని నిజంగా ఆదుకున్నది వైఎస్ జగన్ గారే అని మాజీ మంత్రి బుడి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితికి చేరుతుందని ఊహించలేదన్నారు. ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించి రైతులకు బకాయిలు చెల్లించాలన్నారు. వైయస్ జగన్ హయాంలో చెరుకు రైతులకు గిట్టుబాటు ధర లభించేదని, టీడీపీ పాలనలో ఫ్యాక్టరీ నష్టాల బాట పట్టిందని విమర్శించారు. ఒకప్పుడు ఐదున్నర లక్షల టన్నుల సామర్థ్యం గల చోడవరం షుగర్ ఫ్యాక్టరీ నేడు లక్షల టన్నులకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News