|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 12:14 PM
కూటమి పాలనలో షుగర్ ఫ్యాక్టరీ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని అనకాపల్లి పార్లమెంటు వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త బొడ్డెడ ప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఫ్యాక్టరీని ఆదుకుంటామని ఇచ్చిన హామీలను ఎన్నికల తర్వాత పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.చోడవరం సహకార షుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిల అంశంపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగలోపు రైతులకు బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదీన జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని, అవసరమైతే రాజకీయ పార్టీల నేతలతో పాటు రైతులు రోడ్లపైకి రావాల్సిందేనని పిలుపునిచ్చారు.
Latest News