|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:19 PM
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) జాతీయ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో ప్రభుత్వాలను గద్దె దించడానికి అక్కడి యువత చేసిన హింసాత్మక నిరసనలు భారత్‌లోనూ జరగాలని, అప్పుడే ప్రస్తుత ప్రభుత్వాన్ని అధికారం నుంచి సాగనంపొచ్చని ఆయన పేర్కొన్నారు. ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ "శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో యువత ప్రభుత్వాన్ని ఎలా తరిమి కొట్టారో, అదే తరహా పద్ధతులను భారత్‌లోనూ అమలు చేయాలి" అని పిలుపునిచ్చారు.
Latest News