|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:27 PM
గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలు ఒక వైపు ఉండగా, మరోవైపు యెమెన్ అంశం గల్ఫ్ దేశాల మధ్య చిచ్చు పెట్టింది.ప్రస్తుతం యెమెన్‌లో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం కొనసాగుతోంది. ఈ రెండు వర్గాలకు వేర్వేరు గల్ఫ్ దేశాలు మద్దతు ఇవ్వడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. యెమెన్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ (ఐఆర్‌జీ)కి సౌదీ అరేబియా మద్దతు ఇస్తుండగా, సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎస్టీసీ)కి యూఏఈ అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో యూఏఈ మద్దతుగల దళాలపై సౌదీ అరేబియా దాడులు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ముదిరింది. ఈ దాడుల్లో ఎస్టీసీకి చెందిన పలువురు యోధులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
Latest News