|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:30 PM
సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే మన దేశ మొట్టమొదటి మహిళా టీచర్ అని, స్త్రీ విద్య, హక్కుల సాధన కోసం జీవితాంతం కృషిచేశారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిని సమాజ మార్పునకు శక్తిమంతమైన సాధనంగా భావించారన్నారు. సామాజిక వ్యతిరేకత, అవమానాలు ఎదురైనా బాలికల విద్య కోసం ధైర్యంగా ముందుకు సాగారని, నేటి మహిళా ఉపాధ్యాయులకు ఆమె మార్గదర్శి అనీ అన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి అని లోకేశ్ పేర్కొన్నారు.
Latest News