|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:29 PM
రాష్ట్రంలో అవినీతి తిమింగలాల పని పడతామని, వారిపై ఇప్పటికే నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ (డీజీ) అతుల్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారికి మూడేళ్లలోనే శిక్ష పడేలా చేసి జైలుకు పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అవినీతిపరుల బినామీ ఆస్తుల డేటాను సేకరించేందుకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు.శుక్రవారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలన భవనంలో అతుల్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. 2025 వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఏసీబీ కొత్త వ్యూహాలను, లక్ష్యాలను వివరించారు. ఈ సమావేశంలో ఏసీబీ డైరెక్టర్ ఆర్. జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అతుల్ సింగ్ మాట్లాడుతూ, "రాష్ట్రంలో కరుడుగట్టిన అవినీతిపరులపై నిఘా పెట్టాం. వారి బినామీల డేటాను ఏఐ ద్వారా సేకరిస్తున్నాం. ఈ ఏడాది అవినీతి తిమింగలాల పని పడతాం. అవినీతికి పాల్పడినవారిని మూడేళ్లలోనే జైలుకు పంపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం," అని అన్నారు. ఐజీఆర్ఎస్ వ్యవస్థ నుంచి బినామీ ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు, అనుమానిత బ్యాంకు లావాదేవీలను ఏఐ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు.
Latest News