|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:36 PM
ఉత్తరాఖండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య భర్త గిర్ధారి లాల్ సాహు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి. అల్మోరాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. "ముసలి వయసులో పెళ్లి చేసుకుంటారా? ఒకవేళ పెళ్లి కాకపోతే నేను బీహార్ నుంచి అమ్మాయిని తీసుకొస్తాను. అక్కడ రూ. 20,000 నుంచి 25,000 ఇస్తే అమ్మాయిలు దొరుకుతారు. నాతో రండి, మీకు పెళ్లి చేస్తాను" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.సాహు వ్యాఖ్యలపై విపక్ష కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఒక మహిళా మంత్రి భర్త అయి ఉండి దేశంలోని ఆడబిడ్డలను ఇలా వస్తువులతో పోల్చడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ వ్యాఖ్యలు మానవ అక్రమ రవాణాను ప్రోత్సహించేలా ఉన్నాయని, దీనిపై బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Latest News