పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనపై స్పందించిన దాసోజు శ్రవణ్
 

by Suryaa Desk | Sat, Jan 03, 2026, 11:05 PM

2009లో హుస్నాబాద్ ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రాణాలతో బయటపడటం కేవలం అదృష్టం కాదని, సాక్షాత్తు కొండగట్టు అంజన్న చూపిన ఒక అద్భుతమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనపై ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు.పునర్జన్మనిచ్చిన కొండగట్టు అంజన్నకు భక్తితో కూడిన కృతజ్ఞత తెలిపారంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. ఆ రోజు తాను ప్రాణాలతో బయటపడటం వెనుక కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఉన్నాయనే గట్టి నమ్మకంతో, అచంచలమైన భక్తి విశ్వాసాలతో తనకి పునర్జన్మనిచ్చిన ఆ క్షేత్రంపై కృతజ్ఞతతో, ఆలయ అభివృద్ధి కోసం రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో దీక్షా విరమణ మండపం మరియు సత్రం నిర్మాణానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.ఇందుకు తెలంగాణ ప్రజల పక్షాన పవన్ కల్యాణ్‌కు దాసోజు శ్రవణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆధ్యాత్మికతను, సామాజిక బాధ్యతను చాటుతూ ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అంజన్న ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ నిధుల మంజూరుకు చొరవ చూపి సహకరించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కూడ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Latest News
CPI(M) protests against US action on Venezuela near Chennai consulate Mon, Jan 05, 2026, 03:53 PM
'Never dreamt of becoming a minister': Siddaramaiah set to equal record of longest-serving Karnataka CM Mon, Jan 05, 2026, 03:50 PM
'Owaisi lacks moral standing to question RSS chief': BJP, Shiv Sena amid 'love jihad' debate Mon, Jan 05, 2026, 03:44 PM
Mumbai City FC part ways with Spanish defender Tiri Mon, Jan 05, 2026, 03:42 PM
Severe cold wave grips Bundelkhand; orange alert issued Mon, Jan 05, 2026, 03:02 PM